ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు పట్నం వేళ్లి వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు ఉదయాన్నే పట్నానికి బయలుదేరారు. పట్నానికి వెళ్లాలంటే మధ్యలో ఉన్న అడవిని దాటాలి.
అడవిలో నడుస్తూ ఉంటే స్నేహితులకు తాడు, చేట , గడ్డపార దొరికాయి, ఎందుకైనా మంచిదని వాటిని తమ మూటలో భద్రంగా దాచుకుని నడవసాగారు . చీకటి పడడంతో అడవిలో ఉన్న పాడుబడిన సత్రంలో ఆ రాత్రి నిద్రపోయారు. అడవిలో ఉన్న చిన్న రాక్షసుడికి నర వాసన రావడంతో సత్రానికి చేరుకొని "బయటకు రారా మానవా .... నిన్ను నమిలి మింగేస్తాను " అంటూ అరిచాడు. ఆ అరుపులకు సత్రంలో ఉన్న యిద్దరు మిత్రులు భయంతో ఒణికిపోయారు .
వారిలో ఒక్కడు మాత్రం సమయస్ఫూర్తిని ప్రదర్శించి " నీలాంటి వాళ్ళను ఏంటో మందిని చూసిన పెద్ద రాకాసి నేను.. " అన్నాడు గంభీరంగా. అయితే బయటకు రారా ... నీ ప్రతాపం .. నా ప్రతాపం చూసుకుందాం అంటూ కోపంగా అరిచాడు రాక్షసుడు. నేను రావడం ఎందుకురా నా గోరు చాలు నిన్ను పొడిచి చంపడానికి ... అంటూ గడ్డపారను బయటకు చూపించాడు. "ఆమ్మో" ఇంత పెద్దదా అని ఆశ్చర్యపోయాడు రాక్షసుడు. నా చెవి చూడరా... నా చెవిని ఆడించానంటే కొట్టుకుపోతావ్ రా .... అంటూ చేట ను అటు ఇటూ .. ఆడించాడు. నా తోక చూడరా ... అంటూ .. తాడును బయటకు విసిరాడు. అంటే ఆ దెబ్బతో చిన్న రాక్షసుడు.. పెద్ద బ్రహ్మ రాక్షసి ఏదో లోపల ఉందనే భయంతో అక్కడినుండి పారిపోయింది.
సమయస్ఫూర్తితో తమ ప్రాణాలు కాపాడిన మిత్రుడిని మిగిలిన యిద్దరు స్నేహితులు ఏంతో మెచ్చుకున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి