నాలుగు పళ్ళు తక్కువున్నాయేమిటి? - చదువు రాకపోతే ఎంత అనర్దమో ?

Here is a wide collection of kids and children stories with morals. The Stranger in the Garden, The Rope, Sand and Stone, The Ship, and more funny Short stories from Panchatantra with pictures, in English. Collection of individual stories of Panchatantra with pictures,Stories for Kids with Pictures. English Short Stories to read for Children Online,Telugu Animated Moral Stories for Kids,Chitti Chitti Miriyalu & More Telugu Nursery Stories,stories for children and grown-ups alike - these are not original stories, rather, a compilation of stories,Telugu Kid Stories, Telugu Kids Stories, Telugu Children Stories, Kids Stories in Telugu Language, Children Stories in Telugu Language, Telugu Moral Stories,learning, telugu games, telugu stories, telugu rhymes, Telugu Animated stories, kids games, kids stories, ramayanam mahabharatam stories,Tenali Ramakrishna stories online | Telugu Kids learning videos online. Tenali Ramakrishna stories is most interesting and fun filled Telugu kids learning videos,Pedarasi peddamma kathalu is one of the oldest and interesting stories for telugu children,Kids websites in telugu,telugu kids websites,baby websites in telugu,kathalu,telugu pillala kathalu.


అనగనగా ఒక జమీందారు పొరుగూరిలో వున్న తన కూతురికి ఒక బుట్టలో నిండా మామిడిపళ్ళు పెట్టించి, నమ్మకస్తుడైన నౌకరుకిచ్చి పంపించాడు.

దారి మధ్యలో ఆయాసం తీర్చుకోడానికి సేవకుడు బుట్టను దించి, ఒక చెట్టు నీడలో కాస్సేపు విశ్రమించాడు.

ఘుమ ఘుమలాడి పోతున్నాయి ఆ బుట్టలో మామిడిపళ్ళు. ఒక పక్క ఎండ , మరో పక్క ఆకలి. ఆ పైన ఆ ఘుమ ఘుమలూ. సేవకుడు ఉండ పట్ట లేక పోయాడు.

జమీందారు పళ్ళతో ఇచ్చిన లేఖను ఒక గొయ్యి తీసి కప్పెట్టాడు. జిహ్వ చాపల్యంలో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు పళ్ళు తినేసాడు. హాయిగా ఒక చిన్న కునుకు తీసాడు.

ఏమీ ఎరగనట్టు గొయ్యిలోంచి లేఖని తవ్వి తీసుకుని, బుట్టనెత్తుకుని బయలుదేరాడు.

జమీందారు కూతురు బుట్టనీ, లేఖనీ తీసుకుంది. తండ్రి పంపించిన లేఖ చదివింది. పళ్ళు లెక్కబెట్టించింది.

“నాలుగు పళ్ళు తక్కువున్నాయేమిటి?” అని నిలదీసింది. “నువ్వేమైన తిన్నావా ?”

“అయ్యో! అయ్యో! ఇదెక్కడ విడ్ఢూరం తల్లీ! నేలలో పాతిపెట్టాను కదా, ఈ లేఖ ఎలా చూసింది?” అని లబో దిబో మని తల కొట్టుకున్నాడు.జమీందారు కూతురికి నవ్వొచ్చేసింది. సేవకుడిని క్షమించేసింది.

కాని, చూసారా పిల్లలు, మూర్ఖుడైన ఆ నౌకరికి  చదువు కూడా రాకపోతే ఎంత అనర్దమో ?
Labels:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

[blogger]

సంప్రదింపు ఫారమ్

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *

Blogger ఆధారితం.
Javascript DisablePlease Enable Javascript To See All Widget