Anthe Narayanaswamy-Telugu Katha Rachayatha-అందే నారాయణస్వామి -Biography.

Anthe Narayanaswamy,Biography,Hisory,Story,Telugu Kaivtha,Katha,Rachayatha,TeluguBasha.


 
అందే నారాయణస్వామి
అందే నారాయణస్వామి (1908-1982) ప్రముఖ తెలుగు కథా రచయిత.
జీవిత సంగ్రహం
అందే నారాయణస్వామి గుంటూరు జిల్లా మంగళగిరిలో జన్మించాడు. నేత కార్మికుడు. మల్లాది రామకృష్ణశాస్త్రి, శివశంకరశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, నార్ల వెంకటేశ్వరరావు మొదలైన వారితో సన్నిహితంగా మెలిగాడు. మొదటలో పద్య కవిత్వం వ్రాసినా తరువాత కథా రచయితగా ఎదిగాడు. మొత్తం వందకు పైగా కథలు వ్రాశాడు. రెండు నవలలు, నాలుగు కథాసంపుటాలు వెలువరించాడు. తొలి కథ 1940 లలో ప్రకటించాడు. ఒక దశ తర్వాత అకాల అంధత్వం కూడా ఆయన సాహిత్యసేవకు అడ్డంకి కాలేకపోయింది. ఈయనకు సాహిత్య రంగంలోనే గాక చిత్రలేఖనం, సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. ఈయనకు ముందు ఏ రచయిత తన కుల వృత్తికి సంబంధించిన కథా రచనలను చేయలేదు. చేనేత వృత్తితో బాగా పరిచయం ఉండటం వలన చేనేత వృత్తికి సంబంధించిన కథలను బాగా వ్రాయ గలిగాడు.అందువలన తెలుగు సాహిత్యంలో అందే నారాయణ స్వామి తొలి వృత్తి కథా రచయిత గా గుర్తింపబడ్డాడు.
కథలు
1. వ్యత్యాసాలు (కథల సంపుటి 1940) 2. స్నేహితుడు (కథల సంపుటి 1956) 3. ఉపాసనాబలం (కథల సంపుటి 1957) 4. కారుణ్యం (కథల సంపుటి 1958) 5. చీకటి తెరలు (కథల సంపుటి 2007 విశాలాంధ్ర ప్రచురణ) 6. తానొకటి తలిస్తే ... ! 7. శిల్పి 8. దొంగా-దొర 9. గాలిలో దీపం 10. అమ్మ 11. సవతి 12. తేనెపూసిన కత్తులు 13. ప్రతిఫలం 14. పుత్ర సంతానం15.  పరివర్తనం  16.  సంఘ సంస్కరణ  17.  కొడుకులు  18.  పడుగు పేకల మధ్య బడుగులు  
నవలలు 
 1.కష్టసుఖాలు
 2.ఇద్దరు తల్లులు  బిరుదము  ఆంధ్ర మొపాసా








కామెంట్‌ను పోస్ట్ చేయండి

[blogger]

సంప్రదింపు ఫారమ్

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *

Blogger ఆధారితం.
Javascript DisablePlease Enable Javascript To See All Widget